19, డిసెంబర్ 2009, శనివారం

నా తెలుగు పాట.


నే విన్న తొలి మాట తెలుగు మాట,
నే నన్న తొలి మాట తెలుగు మాట,
నా తెలుగు వేయి వెలుగుల మూట.

తేనెకన్నా తీయనైనది నా తెలుగు,
వెన్నకన్నా సరలమైనది నా తెలుగు,
అమృతంకన్నా అమరమైనది నా తెలుగు.

నా తెలుగు అక్షరాలు చదువుల తల్లి తొలి చేవ్రాలులు,
నా తెలుగు అక్షరాలు నిండు చందురుని నెచ్చెలులు,
నా తెలుగు అక్షరాలు వరూధిని సరితూగు సొగసుగత్తెలు.

నా తెలుగు అక్షరాలు తరతరాలుగా కూడబెట్టిన తీయని తేనె చుక్కలు,
నా తెలుగు అక్షరాలు జగన్నాథుని నోటనానిన నున్నని వెన్నపూసలు,
నా తెలుగు అక్షరాలు జగన్మోహిని చేతులనుండి జారిపడిన అమృత బిందువులు.

నేనుండగ నా తెలుగుకు ఆంగ్ల అక్షరాల అవసరమేలా ?
నేనుండగ నా తెలుగుకు కంప్యూటర్లో క్లిష్టత యేలా ?
నేనుండగ నా తెలుగుకు అంతర్జాలంలో అవధులేల ?
నేనుండగ, నేనుండగ, నేనుండగ, నా తెలుగుకు నేనుండగ.
-అనుపమ

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్
ఇరువది నాలుగు గంటల్లో,
తెలుగు చదవడం వచ్చిన ప్రతిఒక్కరికి,
కంప్యూటర్లో తెలుగు రాయడం నేర్పుతుంది.



5 కామెంట్‌లు:

శ్రీనివాస్ చెప్పారు...

ఎప్పుడు నేర్పుతుంది మీరు ఆ ట్యూటర్ ఇవ్వకుండా

సంతోష్ చెప్పారు...

bagundandi ..
mee "mana telugu" paata.

word verification teeseyagalaru.

అనుపమ చెప్పారు...

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ హైదరాబాదు బుక్ ఫేర్ లో డిశంబర్ 17 నుండి 27 వరకు అందుబాటులో కలదు. మీరు దీనిని అక్కడ తీసుకోగలరు. ట్యూటర్ గురించిన మరిన్ని వివరాలకు www.anupamatyping.com చూడగలరు.

జయ చెప్పారు...

చాలా బాగుందండి. కావాలి అనుకున్నా వారికి మంచి సహాయంగా ఉంటుంది.

అనుపమ చెప్పారు...

జయగారు ధన్యవాదాలండి. మీ ఈ స్పందన "అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్" గురించి అనుకుంటాను.