10, ఏప్రిల్ 2008, గురువారం

ఇన్‌స్క్రిప్ట్‌లో పొల్లు పక్కన హల్లు రాయాలంటే...

ఇన్ స్క్రిప్ట్ లో పొల్లు పక్కన ఏదైనా హల్లు రాయగానే ఆ పొల్లు కాస్తా ద్విత్వాక్షరంగానో, సంయుక్తాక్షరంగానో మారిపోతుంది. ఉదాహరణకు “ఇన్ స్క్రిప్ట్” పదంలోని పొల్లు “న్” పక్కన తదుపరి అక్షరం “స” టైపుచేయగానే అది కాస్తా “న్స” గా మారుతుంది. అలాగే పొల్లు “ప్ట్” పక్కన తదుపరి అక్షరం “లో” రాయగానే అది కాస్తా “ప్ట్లో” గా మారుతుంది. ఇలా కాకుండా ఆయా పొల్లుల పక్కన హల్లులు రాయలంటే, పొల్లు రాయగానే “Shift + Ctrl + No. 2 Key ” లను నొక్కి, ఆ తరువాత హల్లును రాయాలి. అప్పుడు పొల్లు ద్విత్వాక్షరంగానో, సంయుక్తాక్షరంగానో మారదు. “ఇన్‌స్క్రిప్ట్‌లో”, అలా రాసిందే.

9, ఏప్రిల్ 2008, బుధవారం

C.T.C. లో అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్

24 గంటలలో ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో తెలుగు టైపింగ్ నేర్పే అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఇప్పుడు జంటనగరాలలోనే ప్రముఖ కంప్యూటర్ బజార్ అయిన చినాయ్ ట్రేడ్ సెంటర్ (C.T.C.), పార్క్ లేన్, సికింద్రాబాదు లోని అరున్ కంప్యూటర్స్ లో అందుబాటులో ఉంది. తెలుగు టైపింగ్ రాని తెలుగు భాషాభిమానులందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేవలం 24 గంటలలో ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో తెలుగు టైపింగ్ నేర్చుకోగలరు.

6, ఏప్రిల్ 2008, ఆదివారం

లేఖిని, నిఖిలే ల పరీక్షలలో ఇన్ స్క్రిప్ట్ ఫలితాలు.

లేఖిని, నిఖిలే http://lekhini.org/nikhile.html ల ద్వారా మైక్రోసాప్ట్ వర్డ్ మాధ్యమంగా జరిపిన పరీక్షలలో ఇన్ స్క్రిప్ట్ అతి తక్కువ కీస్ట్రోకులతో RTS ఆధారిత ఉపకరాణాల కంటే ఎంతో మెరుగైనదని తేలుతుంది।

లేఖిని, పద్మ, బరహ లాంటి RTS ఆధారిత ఉపకరణాల ద్వారా తెలుగును టైపుచేయడానికి, ఇన్ స్క్రిప్ట్ ద్వారా టైపు చేయడం కంటే ఎక్కువ కీస్ట్రోకుల అవసరం ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే సుమారుగా ఎంత శాతం ఎక్కువ కీస్ట్రోకుల అవసరం ఉంటుదనే విషయం తెలుసుకుందామని, ఈ బ్లాగ్ లో ఇదివరకే ప్రచురించిన రెండు పెద్ద వ్యాసాలు, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు ? మరియు ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు ? తీసుకొని లేఖిని, నిఖిలే ల ద్వారా మైక్రోసాప్ట్ వర్డ్ మాధ్యమంగా పరీక్షించడం జరిగింది.

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు ? అనే వ్యాసంలోని కాంటెంట్ ను మైక్రోసాప్ట్ వర్డ్ లో పేస్ట్ చేసి వర్డ్ కౌంట్ చేస్తే ఈ వ్యాసంలో 4072 క్యారెక్టర్స్ ఉన్నాయి అని తేలింది. ఈ వ్యాసాన్ని నిఖిలే పరికరంలో పేస్ట్ చేసి వచ్చిన ఇంగ్లీష్ వ్యాసాన్ని మైక్రోసాప్ట్ వర్డ్ లో పేస్ట్ చేసి వర్డ్ కౌంట్ చేస్తే 4961 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీనిద్వారా, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు ? అనే వ్యాసాన్ని ఇన్ స్క్రిప్ట్ లో టైపుచేయడానికి 4072 కీస్ట్రోకుల అవసరం కాగా, అదే వ్యాసాన్ని RTS ఆధారిత ఉపకరణాల ద్వారా టైపుచేయడానికి 4961 కీస్ట్రోకులు అవసరం అవుతుందని తేలుతుంది. ఇది సుమారు 22 శాతం ఎక్కువ.

ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు ? అనే వ్యాసంలోని కాంటెంట్ ను మైక్రోసాప్ట్ వర్డ్ లో పేస్ట్ చేసి వర్డ్ కౌంట్ చేస్తే ఈ వ్యాసంలో 3473 క్యారెక్టర్స్ ఉన్నాయి అని తేలింది. ఈ వ్యాసాన్ని నిఖిలే పరికరంలో పేస్ట్ చేసి వచ్చిన ఇంగ్లీష్ వ్యాసాన్ని మైక్రోసాప్ట్ వర్డ్ లో పేస్ట్ చేసి వర్డ్ కౌంట్ చేస్తే 4202 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీనిద్వారా, ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు ? అనే వ్యాసాన్ని ఇన్ స్క్రిప్ట్ లో టైపుచేయడానికి 3473 కీస్ట్రోకుల అవసరం కాగా, అదే వ్యాసాన్ని RTS ఆధారిత ఉపకరణాల ద్వారా టైపుచేయడానికి 4202 కీస్ట్రోకులు అవసరం అవుతుందని తేలుతుంది. ఇది సుమారు 21 శాతం ఎక్కువ.

ఇన్ స్క్రిప్ట్ అతి తక్కువ కీస్ట్రోకులతో RTS ఆధారిత ఉపకరాణాల కంటే ఎంతో మెరుగైనదనే మాట నిజంగా నిజం.

అందుకే ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు ? తెలుగుకు ఆంగ్లలిపి సంకెళ్లు ఎందుకు ? తెలుగును తెలుగులోనే రాద్దాము.