1, నవంబర్ 2008, శనివారం

23 తెలుగు ఫాంట్‌లు...

అంతర్జాలంలో తెలుగు అక్షర సుమాల  అందాలు వికసించాలంటే, ఈ అందమైన ఫాంట్లు అన్ని కంప్యూటర్లలో ఉండాలి. అప్పుడే తెలుగు వెబ్ పేజీలు కొత్త అందాలను అలుముకుంటాయి. ఆలస్యమెందుకు అందుకోండి ఈ తెలుగు పుష్పగుచ్ఛాలను.   కేంద్ర ప్రభుత్వం మన తెలుగు భాషను ప్రాచీన హోదాతో సన్మానించిన ఈ శుభసందర్భాన  తెలుగు వారందరికి శుభాకాంక్షలు. 
  
తెలుగుకు ప్రస్థుతము 23 యూనికోడ్ ఫాంట్‌లు అందుబాటులో ఉన్నాయి. Microsoft వారి Gautami, WindowsXP ఆపరేటింగ్ సిస్టంలోనే ఉన్నది. దేశికాచారి గారి Potana 2000, Vemana 2000 ఫాంట్లకొరకు మరియు Suguna అనే అందమైన ఫాంటు కోసం  http://wiki.etelugu.org/Telugu_Fonts  పైన క్లిక్ చేయండి.  

Amma, Amruta, Atreya, Chandana, Deva, Draupadi, Golkonda, Krishna, Manu, Menaka, Pavani, Priya, Rajan, Rajani, Sanjana, Sitara, Swami, Vennela అనే పద్దెనిమిది GIST TLOT Fonts కోసంhttp://ildc.gov.in/telugu/htm/otfonts.htm  పైన క్లిక్ చేయండి. 

Code2000 అనే ఫాంట్ కోసం http://www.code2000.net/code2000_page.htm  పైన క్లిక్ చేయండి. 
9 కామెంట్‌లు:

Gopal చెప్పారు...

GIST TLOT ఫాంట్లు పూర్తిగా Unicode సపోర్టు చెయ్యవు. అందులో కొన్ని ఫాంట్ల చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఉదాహరణకు ల కు తలకట్టు (!) అలాగే శ్రీ కు తలకట్టు ఇలాంటివి. వీటిలోనే కాదు హిందీ పరిస్థితి కూడా ఇంతే. CDAC వాళ్లు సరయిన సమాధానం ఇవ్వలేదు. అందువల్ల నేను ఆఫాంట్లు వాడటంలేదు.

అనుపమ చెప్పారు...

వేనుగోపాల్ గారు,
మీరు చెప్పిన ల కు తలకట్టు మరియు శ్రీ కు తలకట్టు రెండింటినీ 18 ఫాంట్లలో రాసి చూసాను. సరిగ్గానే వచ్చాయి. ఒక వేల వెర్సన్ తేడా ఏమైనా ఉన్నదేమో. కొత్తగా డౌన్లోడ్ చేసుకొని మరొక్కసారి చూడండి. మీ అనుభవాలను రాయండి.

కిరణ్ చెప్పారు...

హాయ్ అనుపమ, నేను Windows Vista వాడుతున్నాను. నేను కొన్ని ఫాంట్స్ మాత్రం సరిగా చూడలేక పోతున్నాను. How can I install these fonts in Windows Vista

అనుపమ చెప్పారు...

కొత్తపేట గారు

విస్టా కంట్రోల్ ప్యానల్ లో Classic View ను ఎన్నుకొండి. అప్పుడు మీరు Fonts folder ను చూడగలుగురు. ఈ folder ను తెరిచి తెలుగు ఫాంట్స్ ను అందులో Paste చేయండి. అంతే. ఆటోమేటిక్ గా అవి Install అవుతాయి.

Unknown చెప్పారు...

పైన చెప్పిన వాటిలో కాని, ఇంకెక్కడైనా కాని బాపు చేతివ్రాతవి (Bapu Fonts) ఉన్నాయా?

S P SASTRY చెప్పారు...

sir I am using Mac book downloaded thd file telugu fonts and not getting the telugu font pothana in fonts folder despite pasting the copying the downloaded item

Dileep.M చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dileep.M చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dileep.M చెప్పారు...

TeluguVijayam site lOni 3 fontulu,
adityafonts.com vari Ramaneeya
Microsoft vari Nirmal font kalipi marO 5 PhaMTulu vunnaayi.