21, ఫిబ్రవరి 2008, గురువారం

మాతృభాషాదినోత్సవము.

పిబ్రవరి 21, మాతృభాషాదినోత్సవము. తేనెలొలుకు తెలుగును మాతృభాషగా పొందిన తెలుగువారందరికీ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు మరియు ఒక శుభవార్త.

హైదరాబాదు బుక్ ఫేర్ లో మాతృభాషాభిమాణం కలిగిన తెలుగు వారినెందరినో ఆకర్శించి, ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్నామన్న వారి ఎదురు చూపులకు శుభం పలుకుతూ అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ 11 పిబ్రవరి, 2008 న విడుదలయ్యింది.


అనుపమ, తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్. రెండు సంవత్సరాల కృషితో రూపొందించిన ఇంతటి అందమైన, ఉపయోగకరమైన టైపింగ్ ట్యూటర్ ఆంగ్ల భాషతో సహా మరే ఇతర భారతీయ భాషలకు కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో.


నే విన్న తొలి మాట తెలుగు మాట,
నే నన్న తొలి మాట తెలుగు మాట,
నా తెలుగు వేయి వెలుగుల మూట.


నా తెలుగు అక్షరాలు తరతరాలుగా కూడబెట్టిన తీయని తేనె చుక్కలు,
నా తెలుగు అక్షరాలు జగన్నాథుని నోటనానిన నున్నని వెన్నపూసలు,
నా తెలుగు అక్షరాలు జగన్మోహిని చేతులనుండి జారిపడిన అమృతబిందువులు.


తేనె కన్నా తీయనైనది నా తెలుగు,
వెన్న కన్నా సరళమైనది నా తెలుగు,
అమృతం కన్నా అమరమైనది నా తెలుగు.


అని పాడే అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ను విజయవాడ బుక్ ఫేర్ లో చూసి అబ్బురపడి తమ తమ ఇల్లకు సాదరంగా ఆహ్వానించిన అనేక మందికి ధన్యవాదాలు. అనుపమతో తెలుగు టైపింగ్ పాఠాలు నేర్చుకుంటున్న తెలుగు వారందరికీ మరొక్కసారి మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.

2 కామెంట్‌లు:

cbrao చెప్పారు...

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ను ఎవరు తయారు చేసారు? Anu fonts వాళ్లా? ఈ ట్యూటర్ నేర్పేది అను అక్షరాల టైపింగా లేక యునికోడా? ఈ ట్యూటర్ ధర ఎంత? ఎక్కడ లభ్యమవుతుంది?

అనుపమ చెప్పారు...

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ను సుజని సాప్ట్ వేర్ సొల్యూషన్స్, హైదరాబాదు వారు తయారు చేసారు. Anu fonts వారు కాదు.ఈ ట్యూటర్ గరిష్ట ధర రూపాయలు 1200 కాగా, విజయవాడ ఎక్జిబిషన్ లో దీనిని ప్రత్యేక ధర రూపాయలు 999 కే అందించారు.ఈ ట్యూటర్ ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో తెలుగు టైపింగ్ నేర్పుతుంది. ఈ లే అవుట్ ను అన్ని ప్రముఖ తెలుగు సాప్ట్ వేర్ లు సపోర్టు చేస్తున్నాయి. కొన్ని సాప్ట్ వేర్ లలో ఈ ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ ను DOE Layout అని కూడా అంటారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వారు తయారు చేసిన లేఅవుట్ కనుక. మరిన్ని వివరాల కోసం అనుపమ టైపింగ్ ట్యుటర్ ఎందుకు? అనే బ్లాగును, ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా, ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు అనే బ్లాగును చదవండి. అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ వారి వెబ్ సైటు www.anupamatypng.com ను చూడండి. అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ కోసం హైదరాబాదుకు చెందిన ఈ కంపెనీ ఫోన్ నంబర్లను సంప్రదించండి. 040-32533445, 040-30421507, 09704872664