లేఖిని, నిఖిలే http://lekhini.org/nikhile.html ల ద్వారా మైక్రోసాప్ట్ వర్డ్ మాధ్యమంగా జరిపిన పరీక్షలలో ఇన్ స్క్రిప్ట్ అతి తక్కువ కీస్ట్రోకులతో RTS ఆధారిత ఉపకరాణాల కంటే ఎంతో మెరుగైనదని తేలుతుంది।
లేఖిని, పద్మ, బరహ లాంటి RTS ఆధారిత ఉపకరణాల ద్వారా తెలుగును టైపుచేయడానికి, ఇన్ స్క్రిప్ట్ ద్వారా టైపు చేయడం కంటే ఎక్కువ కీస్ట్రోకుల అవసరం ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే సుమారుగా ఎంత శాతం ఎక్కువ కీస్ట్రోకుల అవసరం ఉంటుదనే విషయం తెలుసుకుందామని, ఈ బ్లాగ్ లో ఇదివరకే ప్రచురించిన రెండు పెద్ద వ్యాసాలు, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు ? మరియు ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు ? తీసుకొని లేఖిని, నిఖిలే ల ద్వారా మైక్రోసాప్ట్ వర్డ్ మాధ్యమంగా పరీక్షించడం జరిగింది.
అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు ? అనే వ్యాసంలోని కాంటెంట్ ను మైక్రోసాప్ట్ వర్డ్ లో పేస్ట్ చేసి వర్డ్ కౌంట్ చేస్తే ఈ వ్యాసంలో 4072 క్యారెక్టర్స్ ఉన్నాయి అని తేలింది. ఈ వ్యాసాన్ని నిఖిలే పరికరంలో పేస్ట్ చేసి వచ్చిన ఇంగ్లీష్ వ్యాసాన్ని మైక్రోసాప్ట్ వర్డ్ లో పేస్ట్ చేసి వర్డ్ కౌంట్ చేస్తే 4961 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీనిద్వారా, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు ? అనే వ్యాసాన్ని ఇన్ స్క్రిప్ట్ లో టైపుచేయడానికి 4072 కీస్ట్రోకుల అవసరం కాగా, అదే వ్యాసాన్ని RTS ఆధారిత ఉపకరణాల ద్వారా టైపుచేయడానికి 4961 కీస్ట్రోకులు అవసరం అవుతుందని తేలుతుంది. ఇది సుమారు 22 శాతం ఎక్కువ.
ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు ? అనే వ్యాసంలోని కాంటెంట్ ను మైక్రోసాప్ట్ వర్డ్ లో పేస్ట్ చేసి వర్డ్ కౌంట్ చేస్తే ఈ వ్యాసంలో 3473 క్యారెక్టర్స్ ఉన్నాయి అని తేలింది. ఈ వ్యాసాన్ని నిఖిలే పరికరంలో పేస్ట్ చేసి వచ్చిన ఇంగ్లీష్ వ్యాసాన్ని మైక్రోసాప్ట్ వర్డ్ లో పేస్ట్ చేసి వర్డ్ కౌంట్ చేస్తే 4202 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీనిద్వారా, ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు ? అనే వ్యాసాన్ని ఇన్ స్క్రిప్ట్ లో టైపుచేయడానికి 3473 కీస్ట్రోకుల అవసరం కాగా, అదే వ్యాసాన్ని RTS ఆధారిత ఉపకరణాల ద్వారా టైపుచేయడానికి 4202 కీస్ట్రోకులు అవసరం అవుతుందని తేలుతుంది. ఇది సుమారు 21 శాతం ఎక్కువ.
ఇన్ స్క్రిప్ట్ అతి తక్కువ కీస్ట్రోకులతో RTS ఆధారిత ఉపకరాణాల కంటే ఎంతో మెరుగైనదనే మాట నిజంగా నిజం.
అందుకే ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు ? తెలుగుకు ఆంగ్లలిపి సంకెళ్లు ఎందుకు ? తెలుగును తెలుగులోనే రాద్దాము.
6 కామెంట్లు:
సై
==
(పైది రెండు కీ-దెబ్బలతో సాధించా, అంటే ముప్పైమూడు శాతం ఆదా అన్నమాట :-)
కేవలం key strokes ఒక్కటే కాకుండా ఈ రెండు విధానాలకు ఎంతెంత సమయం పట్టిందో తెలిపి ఉంటే బాగుండేది. నాలాగ కేవలం English typing మాత్రమే తెలిసినవారికి inscrpitకన్నా transliteration పద్ధతిలోనే ఎక్కువ వేగం సాధ్యం కదా.
అవును నిజమే .. ఇంగ్లీషు తెలుగు రెండూ టైపు చెయ్యడం తెలిసిన వాళ్లచేత పరీక్షచేయిస్తే ఈ వ్యాసానికి సమగ్రత వచ్చేది.
మనకు ఇప్పుడు తెలిసినవన్నీ ఒకప్పుడు తెలియనివే
అభ్యాసం కూసువిద్య అన్నారు పెద్దలు.
గిరి గారు,
మీరు చెప్పింది నిజమే. అయితే అందం బ్లాగు రచయిత శ్రీ రాకేశ్వర రావుగారన్నట్లు, “క్షంత్రైజ్ఞ అనడానికి తెలుగు కీబోర్డులో 5 మీటలు నోక్కాల్సి వస్తే, RTS లో 12 మీటలు నొక్కాలి ! ( సుమారు 120 శాతం ఎక్కువ. ) మరీ ఎప్పుడూ ఇంత రాబడి ఉండదు కాని, సగటున తక్కువ మీటలు అవసరమౌతాయి.” ఆ సగటు లెక్కను తేల్చడానికే వీలైనంత పెద్ద వ్యాసాలను తీసుకొని పరీక్షించడం జరిగింది.
Raj గారు మరియు మురళీకృష్ణ గారు,
ఇంగ్లీషు, తెలుగు రెండింటిలో సమాన వేగంతో టైపుచేయగలిగే వ్యక్తిని ఈ రెండు వ్యాసాలను టైపుచేయమంటే, లాజికల్ గా ఎక్కువ కీస్ట్రోకులు అవసరమయ్యే వ్యాసానికి ఎక్కువ సమయం పట్టాలి. ఇంగ్లీష్ టైపింగ్ బాగా వచ్చి తెలుగు టైపింగ్ అంత బాగా రానివారికి తెలుగు వ్యాసానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాగే తెలుగు టైపింగ్ బాగా వచ్చి ఇంగ్లీష్ టైపింగ్ అంత బాగా రానివారికి ఇంగ్లీష్ టైపింగ్ కు మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు. అందుచేత మిగతా అన్ని సామర్ఠ్యాలు సమానంగా ఉన్నప్పుడు, RTS ఆధారిత పరికరాలలో తెలుగును టైపు చేయడానికి సుమారు 20 శాతం ఎక్కువ కీస్ట్రోకులు అవసరమవుతున్నాయి కనుక, అదే లెక్కన ఎక్కువ సమయం పడుతుంది అనటంలో సందేహానికి అవకాశం లేదు.
తెలుగు టైపింగ్ బ్రహ్మవిద్యేమీ కాదు. ఇంగ్లీష్ టైపింగ్ లాగే ఒకింత సాదనతో తెలుగు టైపింగ్ ను అతి సులువుగా నేర్చుకోవచ్చును. తెలుగును తెలుగులోనే రాద్దాము.
నాకు ఏ మాత్రం నచ్చలెదు inscript ley out నా దృష్టిలో waste కేవలం 20 % speed వస్తుంది అని దాని లోపాన్ని మార్చలేము ఎక్కువగా తెలుగులో వాడేపదాలు అయిన పేర్లు , వూర్లు, ఉదా:వెంకట్రావు,రామ్‌గోపాల్‌వర్మ , ఫైర్ఫాక్స్ ఇలంటి పదాలు మనం inscript లో రాయలేము ఒకవేల రాస్తే ఇలా వుంటుంది., వెంకట్రావు ,రాంగోపాలవర్మ , ఫైర్ఫాక్స్ .
కార్తీక్‌గారు,ఇన్‌స్క్రిప్ట్‌లో పొల్లు పక్కన హల్లు అనే ఆర్టికల్‌ను చూడండి. మీరు చెప్పిన పదాలన్నింటిని ఇన్‌స్క్రిప్ట్ లో రాయవచ్చును. కార్తీక్‌గారు అనడంలోనూ పొల్లుపక్కన హల్లు రాయడం జరిగింది.
మీకు ఇన్‌స్క్రిప్ట్ నచ్చకపోవడానికి ఈ ఒక్క సమస్యే కారణమైతే,
ఈ సమస్యకు సమాధానం దొరికింది కనుక మీకు ఇక ఇన్‌స్క్రిప్ట్ నచ్చుతుందని అనుకుంటాను. ఇదంతా ఇన్‌స్క్రిప్ట్ లోనే రాయడం జరిగింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి