ఇన్ స్క్రిప్ట్ లో పొల్లు పక్కన ఏదైనా హల్లు రాయగానే ఆ పొల్లు కాస్తా ద్విత్వాక్షరంగానో, సంయుక్తాక్షరంగానో మారిపోతుంది. ఉదాహరణకు “ఇన్ స్క్రిప్ట్” పదంలోని పొల్లు “న్” పక్కన తదుపరి అక్షరం “స” టైపుచేయగానే అది కాస్తా “న్స” గా మారుతుంది. అలాగే పొల్లు “ప్ట్” పక్కన తదుపరి అక్షరం “లో” రాయగానే అది కాస్తా “ప్ట్లో” గా మారుతుంది. ఇలా కాకుండా ఆయా పొల్లుల పక్కన హల్లులు రాయలంటే, పొల్లు రాయగానే “Shift + Ctrl + No. 2 Key ” లను నొక్కి, ఆ తరువాత హల్లును రాయాలి. అప్పుడు పొల్లు ద్విత్వాక్షరంగానో, సంయుక్తాక్షరంగానో మారదు. “ఇన్‌స్క్రిప్ట్‌లో”, అలా రాసిందే.
4 కామెంట్లు:
నా సమస్య తీరింది.కృతజ్ఞతలు...వాసు.బి
ప్రయత్నించాను కానీ పనిచేయడంలేదేంటి?
“Shift + Ctrl + No. 2 Key ” లను నొక్కి, వదిలేసిన తరువాత హల్లును నొక్కాలి. ప్రయత్నించి చూడండి.
@giri, మీరు మంటనక్కలో ప్రయత్నిస్తున్నారా? అందులో పనిచేయదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి