19, డిసెంబర్ 2009, శనివారం

ఒక ఆవేదన, ఒక ఆలోచన, ఒక ఆవిష్కరణ.


ఒక ఆవేదన



లిపిలేని భాషలు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి, ఇతర భాషల్లో విలీనమైపోయి క్రమంగా కనుమరుగై పోతాయి అనేది అనుభవ సత్యం. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష, చందమామలాంటి అందమైన అక్షరాల తెలుగు భాష, తేనె తీయదనాన్ని మరిపించే తెలుగు భాష, మన అమ్మ భాష, అలా కనుమరుగైపోవడం మనకిష్టమేనా?

నలబైఏల్ల అధికార భాష, అధికారుల ఆచరణలో నాలుగో శాతం కూడా లేని భాష, మన తేనెలొలుకు తెలుగు భాష. చట్ట సభల్లో అడంబరం కోసం ఆంగ్లంలో మాట్లాడే శాసన సభ్యుల గొప్పతనంతో చిన్నవోయిన భాష మన తెలుగు భాష. టైపు మిషిన్ లలో తలకట్టులొకపక్క, ఒత్తులొక పక్క ఒరిగి పోయి అందం పాడయిపోయినా అసువులు నిలిస్తే అదే పదివేలు అనుకున్న భాష. కంప్యూటర్ కాలంలో కొత్త మెరుపులు దిద్తుకోవచ్చుననుకుంటే, ఆంగ్ల అక్షరాలతో తెలుగును రాసే పద్ధతికి అలవాటుపడి, ఉన్న లిపిని పోగొట్టుకుంటున్నామా.

కంప్యూటర్లలో తెలుగు ప్రథమశ్రేణి భాషగా వెలుగొందాలంటే రోమన్ లిపినే తెలుగు భాషకు అనుగుణమైన సంకేతాలు చేర్చుకుని వాడుకుంటే ప్రపంచం సాధిస్తున్న వేగాన్ని మనం అందుకోగలం, అనే భావనలు బాధాకరం కాదా. ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ కు అలవాటు పడి, తెలుగును తెలుగులో రాసే పద్ధతికి దూరమవుతున్నామా. తెలుగును ఆంగ్ల అక్షరాలతో రాసే పద్ధతికి, ట్రాన్స్ లిటరేషన్ స్కీమ్ లకు ప్రత్యామ్నయం లేదా.

ఒక ఆలోచన

ఇన్ స్ర్కిప్ట్ ఇంపుగా లేదా. సాదనమున పనులు సమకూరు ధరలోన అన్న వేమన్న సూక్తి గుర్తు లేదా. సాదన లేకుండానే ఆంగ్లంలో టైపింగ్ చేయగలమా. సాదనతో తెలుగు టైపింగ్ రాదా. కంప్యూటర్లలో తెలుగును ఆంగ్ల అక్షరాలతో రాసే పద్ధతికి స్వస్థిచెప్పడానికి, ఇన్ స్ర్కిప్ట్ లేఅవుట్ లో తెలుగు టైపింగ్ నేర్చుకుంటే సరిపోదా. తెలుగును తెలుగులో రాయడానికి, తెలుగు లిపికి కొత్త ప్రాణం పోయడానికి ఇది ఒక సరైన దారికాదా.

సరే, కానీ అందరూ ఏకలవ్యులు కాలేరు కదా. గురువు లేక విద్య వచ్చునా. ఇన్ స్ర్కిప్ట్ లేఅవుట్ లో తెలుగు టైపింగును నేర్పేదెవ్వరు. ఎపుడో అపుడు ఎవరో ఒకరు రాకపోతారా, తెలుగు టైపింగ్ నేర్పడానికి, తన ఆలోచనలకు ప్రాణం, రూపం తానై నిలిచే తల్లి భాషకు తన ఋణం తీర్చుకోవడానికి.

ఒక ఆవిష్కరణ

ఆ అవేదన ఆలోచనగా మారగా, ఆ ఆలోచనలనుండి పుట్టుకొచ్చిన ఒక కొత్త ఉపకరణం, “అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్”.

ఇన్ స్ర్కిప్ట్ లేఅవుట్ లో, ఇరువదినాలుగు గంటల్లో, తెలుగు చదవడం వచ్చిన ప్రతి ఒక్కరికి, కంప్యూటర్లో తెలుగును తెలుగులో రాయడం నేర్పిస్తుంది. తెలుగు పదకవితాపితామహుడైన అన్నమయ్య సంకీర్తనల శ్రావ్యమైన నేపథ్య సంగీతాన్ని వినిపిస్తూ, తెలుగు సంస్కృతికి అద్దంపట్టే అనేక ఆటలద్వారా, తెలుగు టైపింగ్ ఒక చిన్నపిల్లల ఆట, అని నిరూపిస్తుంది, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్. ఇది ఒక శుభోదయం.


ఈ వ్యాసము ఇంతకు ముందు www.anupamat.blogspot.com లో 21-10-2007 ప్రచురించబడినది.

27, మార్చి 2009, శుక్రవారం

ఉగాది శుభాకాంక్షలు.

తెలుగువారందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీపి కబురు. మీ స్వంత వెబ్‌సైట్ కేవలం రూ. 50/- ప్రతినెలకు. అందిస్తున్నవారు సుజని సాప్ట్‌వేర్ సొల్యూషన్స్. మరిన్ని వివరాలకు వారి వెబ్‌సైట్ www.sujani.co.in చూడండి.

19, డిసెంబర్ 2008, శుక్రవారం

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో అనుపమ.

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంది. ఈ సాప్ట్వేర్ ను ప్రాక్టికల్ గా ఉపయోగించి చూసే అవకాశం కల్పించడం జరుగుతుంది. అంతేకాక కంప్యూటర్లో తెలుగు రాయడం గురించి, ఇంటర్నెట్ పైన తెలుగు ఉపయోగించే విధానం గురించి, అందుబాటులో ఉన్న తెలుగు ఫాంట్ల గురించి, వివిధ ఇతర సాప్ట్వేర్లలో తెలుగును ఉపయేగించే విధానం గురించి సందేహాలను నివృత్తిచేయడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన సందర్బంగా, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ధరపై ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇవ్యడం జరుగుతుంది.

1, నవంబర్ 2008, శనివారం

23 తెలుగు ఫాంట్‌లు...

అంతర్జాలంలో తెలుగు అక్షర సుమాల  అందాలు వికసించాలంటే, ఈ అందమైన ఫాంట్లు అన్ని కంప్యూటర్లలో ఉండాలి. అప్పుడే తెలుగు వెబ్ పేజీలు కొత్త అందాలను అలుముకుంటాయి. ఆలస్యమెందుకు అందుకోండి ఈ తెలుగు పుష్పగుచ్ఛాలను.   కేంద్ర ప్రభుత్వం మన తెలుగు భాషను ప్రాచీన హోదాతో సన్మానించిన ఈ శుభసందర్భాన  తెలుగు వారందరికి శుభాకాంక్షలు. 
  
తెలుగుకు ప్రస్థుతము 23 యూనికోడ్ ఫాంట్‌లు అందుబాటులో ఉన్నాయి. Microsoft వారి Gautami, WindowsXP ఆపరేటింగ్ సిస్టంలోనే ఉన్నది. దేశికాచారి గారి Potana 2000, Vemana 2000 ఫాంట్లకొరకు మరియు Suguna అనే అందమైన ఫాంటు కోసం  http://wiki.etelugu.org/Telugu_Fonts  పైన క్లిక్ చేయండి.  

Amma, Amruta, Atreya, Chandana, Deva, Draupadi, Golkonda, Krishna, Manu, Menaka, Pavani, Priya, Rajan, Rajani, Sanjana, Sitara, Swami, Vennela అనే పద్దెనిమిది GIST TLOT Fonts కోసంhttp://ildc.gov.in/telugu/htm/otfonts.htm  పైన క్లిక్ చేయండి. 

Code2000 అనే ఫాంట్ కోసం http://www.code2000.net/code2000_page.htm  పైన క్లిక్ చేయండి. 




19, అక్టోబర్ 2008, ఆదివారం

మరే ఇతర ప్రత్యేక తెలుగు సాప్ట్వేర్ అవసరం లేకుండానే...


అనుపమతో తెలుగు టైపింగ్ నేర్చుకోవడంద్వారా, మరే ఇతర ప్రత్యేక తెలుగు సాప్ట్‌వేర్ అవసరం లేకుండానే కంప్యూటర్లో ఏ పనైనా తెలుగులో చేయగలుగుతాము.  Windows XP, Windows Vista Operating Systems మరియు Microsoft Office, OpenOffice.org లాంటి సాప్ట్వేర్లు తెలుగు యూనీకోడ్ ఫాంట్లను సపోర్టు చేయడం ద్వారా, ILeap, Leap Office, Akruti, Sri Lipi, Anu Fonts etc. లాంటి మరే ఇతర ప్రత్యేక తెలుగు సాప్ట్వేర్ల అవసరం లేకుండానే మనం తెలుగులో ఏ పనైనా  కంప్యూటర్లో చేయగలుగుతాము. బరహ, పద్మ, లేఖిని లాంటి Transliteration Tools ల అవసరం కూడా ఉండదు.

INKSKAPE లాంటి Free Drawing Software తెలుగు యూనీకోడ్ ఫాంట్లను సపోర్టు చేస్తుంది. అంతేకాక, ప్రస్ధుతము ADOBE వారి Products లలో తెలుగు యూనీకోడ్ సపోర్టు లేకపోయినా, INKSKAPE లోని Transparent Background గల తెలుగు Text Layers (saved by exporting as .png files) ను ADOBE వారి Photoshop లాంటి Products లలో ఉపయోగించి ADOBE వారి Products లలో కూడా తెలుగులో ఏ పనైనా చేయవచ్చును.

ADOBE వారి Page Maker 7 మరియు దాని తరువాతి Versions గా వచ్చిన Indesign, Indesign CS2, Indesign CS3 లాంటి publishing software లలో తెలుగు యూనికోడ్ ఫాంట్లకు తగిన సపోర్టు లేకపోయినా, Microsoft వారి Publisher తెలుగు యూనికోడ్ ఫాంట్లకు పూర్తి సపోర్టు ఇస్తుంది. త్వరలో రాబోయే Indesign CS4 (Middle East Version) లో  తెలుగు యూనికోడ్ ఫాంట్లకు తగిన సపోర్టు ఉంటుందని వినికిడి.

ప్రస్థుతము తెలుగుకు, Microsoft వారి Gautami, దేశికాచారి గారి Potana 2000, Vemana 2000, CDAC వారి పద్దెనిమిది GIST TLOT Fonts Amma, Amruta, Atreya, Chandana, Deva, Draupadi, Golkonda, Krishna, Manu, Menaka, Pavani, Priya, Rajan, Rajani, Sanjana, Sitara, Swami, Vennela లలు, మరో రెండు ఇతర ఫాంట్లు Code2000, Suguna లతో కలుపుకొని, ఇరవైమూడు యూనికోడ్ ఫాంట్స్ అందుబాటులో ఉన్నాయి. 

ఇరవైమూడు తెలుగు యూనికోడ్ ఫాంట్లు అందుబాటులో ఉండడం, Microsoft Products అన్నీ మరియు OpenOffice.org లాంటి సాప్ట్వేర్లు తెలుగు యూనీకోడ్ ఫాంట్లను సపోర్టు చేయడం, INKSKAPE Text Layers నుపయోగించి ADOBE వారి Products లలో కూడా తెలుగులో పనిచేయగలగడం ద్వారా, ILeap, Leap Office, Akruti, Sri Lipi, Anu Fonts etc. లాంటి మరే ప్రత్యేక తెలుగు సాప్ట్వేర్ల అవసరం లేకుండానే మనం తెలుగులో ఏ పనైనా  కంప్యూటర్లో చేయగలుగుతాము అని నిస్సందేహంగా చెప్పవచ్చును.