అంతర్జాలంలో తెలుగు అక్షర సుమాల అందాలు వికసించాలంటే, ఈ అందమైన ఫాంట్లు అన్ని కంప్యూటర్లలో ఉండాలి. అప్పుడే తెలుగు వెబ్ పేజీలు కొత్త అందాలను అలుముకుంటాయి. ఆలస్యమెందుకు అందుకోండి ఈ తెలుగు పుష్పగుచ్ఛాలను. కేంద్ర ప్రభుత్వం మన తెలుగు భాషను ప్రాచీన హోదాతో సన్మానించిన ఈ శుభసందర్భాన తెలుగు వారందరికి శుభాకాంక్షలు.
తెలుగుకు ప్రస్థుతము 23 యూనికోడ్ ఫాంట్‌లు అందుబాటులో ఉన్నాయి. Microsoft వారి Gautami, WindowsXP ఆపరేటింగ్ సిస్టంలోనే ఉన్నది. దేశికాచారి గారి Potana 2000, Vemana 2000 ఫాంట్లకొరకు మరియు Suguna అనే అందమైన ఫాంటు కోసం http://wiki.etelugu.org/Telugu_Fonts పైన క్లిక్ చేయండి.
Amma, Amruta, Atreya, Chandana, Deva, Draupadi, Golkonda, Krishna, Manu, Menaka, Pavani, Priya, Rajan, Rajani, Sanjana, Sitara, Swami, Vennela అనే పద్దెనిమిది GIST TLOT Fonts కోసంhttp://ildc.gov.in/telugu/htm/otfonts.htm పైన క్లిక్ చేయండి.
Code2000 అనే ఫాంట్ కోసం http://www.code2000.net/code2000_page.htm పైన క్లిక్ చేయండి.