అనుపమతో తెలుగు టైపింగ్ నేర్చుకోవడంద్వారా, మరే ఇతర ప్రత్యేక తెలుగు సాప్ట్వేర్ అవసరం లేకుండానే కంప్యూటర్లో ఏ పనైనా తెలుగులో చేయగలుగుతాము. Windows XP, Windows Vista Operating Systems మరియు Microsoft Office, OpenOffice.org లాంటి సాప్ట్వేర్లు తెలుగు యూనీకోడ్ ఫాంట్లను సపోర్టు చేయడం ద్వారా, ILeap, Leap Office, Akruti, Sri Lipi, Anu Fonts etc. లాంటి మరే ఇతర ప్రత్యేక తెలుగు సాప్ట్వేర్ల అవసరం లేకుండానే మనం తెలుగులో ఏ పనైనా కంప్యూటర్లో చేయగలుగుతాము. బరహ, పద్మ, లేఖిని లాంటి Transliteration Tools ల అవసరం కూడా ఉండదు.
INKSKAPE లాంటి Free Drawing Software తెలుగు యూనీకోడ్ ఫాంట్లను సపోర్టు చేస్తుంది. అంతేకాక, ప్రస్ధుతము ADOBE వారి Products లలో తెలుగు యూనీకోడ్ సపోర్టు లేకపోయినా, INKSKAPE లోని Transparent Background గల తెలుగు Text Layers (saved by exporting as .png files) ను ADOBE వారి Photoshop లాంటి Products లలో ఉపయోగించి ADOBE వారి Products లలో కూడా తెలుగులో ఏ పనైనా చేయవచ్చును.
ADOBE వారి Page Maker 7 మరియు దాని తరువాతి Versions గా వచ్చిన Indesign, Indesign CS2, Indesign CS3 లాంటి publishing software లలో తెలుగు యూనికోడ్ ఫాంట్లకు తగిన సపోర్టు లేకపోయినా, Microsoft వారి Publisher తెలుగు యూనికోడ్ ఫాంట్లకు పూర్తి సపోర్టు ఇస్తుంది. త్వరలో రాబోయే Indesign CS4 (Middle East Version) లో తెలుగు యూనికోడ్ ఫాంట్లకు తగిన సపోర్టు ఉంటుందని వినికిడి.
ప్రస్థుతము తెలుగుకు, Microsoft వారి Gautami, దేశికాచారి గారి Potana 2000, Vemana 2000, CDAC వారి పద్దెనిమిది GIST TLOT Fonts Amma, Amruta, Atreya, Chandana, Deva, Draupadi, Golkonda, Krishna, Manu, Menaka, Pavani, Priya, Rajan, Rajani, Sanjana, Sitara, Swami, Vennela లలు, మరో రెండు ఇతర ఫాంట్లు Code2000, Suguna లతో కలుపుకొని, ఇరవైమూడు యూనికోడ్ ఫాంట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇరవైమూడు తెలుగు యూనికోడ్ ఫాంట్లు అందుబాటులో ఉండడం, Microsoft Products అన్నీ మరియు OpenOffice.org లాంటి సాప్ట్వేర్లు తెలుగు యూనీకోడ్ ఫాంట్లను సపోర్టు చేయడం, INKSKAPE Text Layers నుపయోగించి ADOBE వారి Products లలో కూడా తెలుగులో పనిచేయగలగడం ద్వారా, ILeap, Leap Office, Akruti, Sri Lipi, Anu Fonts etc. లాంటి మరే ప్రత్యేక తెలుగు సాప్ట్వేర్ల అవసరం లేకుండానే మనం తెలుగులో ఏ పనైనా కంప్యూటర్లో చేయగలుగుతాము అని నిస్సందేహంగా చెప్పవచ్చును.