10, మార్చి 2008, సోమవారం

ఇన్ స్క్రిప్ట్ లో ౄ,ౠ లు, ఌ,ౡ లు.

విజయవాడ నుండి అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ తో తెలుగు టైపింగ్ నేర్చుకుంటున్న ఒక పెద్దాయన అడిగారు, ఏమండీ, ఇన్ స్క్రిప్ట్ లో ౄ,ౠ లు, ఌ,ౡ లు లేవు కదండి మరి వాటిని వాడాలంటే ఎలా ? నిజమే ఇన్ స్క్రిప్ట్ కీబోర్డుపైన ఇవి కనిపించవు. ఆధునిక తెలుగులో వీటి ఉపయోగం తగ్గిపోయినందున, వీటిని నేర్పాల్సిన అవసరం లేదు అనే భావన ఉండడం ద్వారా, మన ప్రస్థుత తెలుగు బాలశిక్షలో కూడా వీటిని చేర్చ లేదు. ఆయనే అడిగారు కౄరుడు అని రాయలంటే ౄ కావాలి కదండి అని. ప్రస్థుతము కౄరుడును, క్రూరుడు అని కూడా రాస్తున్నారు. ఏదేమైనా ౄ,ౠ లు, ఌ,ౡ లు కూడా రాయల్సివస్తే ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో అవి కూడా కలవు. అంతే కాక ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో తెలుగు అంకెలు కూడా కలవు. వాటిని రాయడానికి నొక్కాల్సిన కీ కాంబినేషన్లను కింద ఇవ్వడం జరిగింది, ఇన్ స్క్రిప్ట్ వాడే అందరి సౌలభ్యం కోసం.

ౄ, దీని కోసం కుడి Alt ను (దీనిని Alt Gr అని కూడా అంటారు.) నొక్కి ఋ, కీని (Plus Key) నొక్కాలి.
ౠ, దీని కోసం Ctrl, Alt, Shift నొక్కి ఋ, కీని (Plus Key) నొక్కాలి.
ఌ, దీని కోసం Ctrl, Alt, Shift నొక్కి ఇ, కీని (F Key) నొక్కాలి.
ౡ, దీని కోసం Ctrl, Alt, Shift నొక్కి ఈ, కీని (R Key) నొక్కాలి.
౧,౨,౩,౪,౫,౬,౭,౮,౯,౦ ఈ తెలుగు అంకెల కోసం కుడి Alt ను (దీనిని Alt Gr అని కూడా అంటారు.) నొక్కి, ఆయా అంకెల కీలను, (1,2,3,4,5,6,7,8,9,0 ల కీలన్నమాట) నొక్కాలి.

పైన పేర్కొన్న విధంగా, ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో, తెలుగులో రాయడానికి కావలసిన అన్ని అక్షరాలు, గుణింతాలు, అంకెలు కలవు. ప్రస్థుత వాడుక తెలుగులో ఈ అక్షరాలు, అంకెలు లేనందున వాటిని ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు పైన ఇవ్వలేదు, అంతే తప్ప అవి లేవనికాదు.

ఇంతకు ముందు రాసిన బ్లాగులలో పేర్కొన్న విధంగా, భారతీయ భాషలలో కంప్యూటర్లో రాయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ Department of Electronics (DOE), వారి ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ ఎంతో ఉత్తమమైనది. అందుకే ఇన్ స్క్రిప్ట్ కు మారండి, మీ ఆలోచనల వేగంతో రాయండి.
తెలుగును తెలుగులోనే రాద్దాము, ఇన్ స్క్రిప్టే ముద్దు, తెలుగుకు ఆంగ్లలిపి సంకెళ్లిక వద్దు.

7 కామెంట్‌లు:

రాఘవ చెప్పారు...

నేను inscript వాడటం యీ మధ్యనే మొదలుపెట్టాను. ౄ,ౠ లు, ఌ,ౡ ల గురించి చెప్పి బోలెడు సహాయం చేసారు. కృతజ్ఞతలు.

అనుపమ చెప్పారు...

ఇన్ స్క్రిప్ట్ ను వాడమని కనీసం ఓ నలుగురికి చెప్పండి. తెలుగును తెలుగులోనే రాద్దాము. తెలుగుకు అంగ్లలిపి సంకెళ్లు వద్దు.

రానారె చెప్పారు...

చ మరియు ఛ కాక చప్పిడి చ మరియు అలాంటిదే జ కూడా ఇన్‌స్క్రిప్టుతో రాయొచ్చని విన్నాను. అవి ఎలాగండి?

సత్యసాయి కొవ్వలి Satyasai చెప్పారు...

నాకు ఇన్స్క్రిప్టు నచ్చిందీ, వచ్చింది. ఒకటే సమస్య- ?, !, * +, = లాంటివి , ముఖ్యంగా మొదటి మూడూ, రాయడంకోసం టాగుల్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. అవేమో అస్తమానూ కావల్సినవాయే.

గిరి Giri చెప్పారు...

సత్యసాయి గారు, నేను తెలుగు నుండి ఆంగ్లానికి మారడానికి ఆల్ట్ + షిఫ్ట్ వాడతాను, మీరడిగిన సింబల్స్ కోసం అలా మార్చడం నాకు సులభంగా అలవాటు కూడా అయిపోయింది, మీరూ ప్రయత్నించి చూడండి

K H H V S S Narasimha Murthy చెప్పారు...

ఇన్‍స్క్రిప్ట్ల్‌ కీ బొర్డ్ తొ బండిర ఏలా టైప్ చేయ్యాలి?
అలాగే చప్పిడి చ, జెడలో జ ఏలా టైప్ చేయ్యాలి?

K H H V S S Narasimha Murthy చెప్పారు...

ఇన్‌స్క్రిప్ట్ కీ బోర్డ్ తో తెలుగు లిపిలొ సంస్కృతం టైపు చేసేచపుడు అవగ్రహ అనే గుర్తు ('2'లాగా ఉంటుంది) ను ఏలా టైపు చేయాలి? దయచేసి తెలపండి.